'మహిళలు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి'

'మహిళలు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి'

VKB: జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలు, యువతులు దుస్తులు కుట్టడంపై ఇస్తున్న ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ఏపీఎం బాలయ్య వారికి సూచించారు. తాండూరు, యాలాల మండలాల మహిళల శిక్షణ కార్యక్రమాన్ని నిన్న ఆయన ప్రారంభించారు. ప్రభుత్వ బడుల విద్యార్థులకు అందించే ఏకరూప దుస్తులను మంచిగా కుట్టాలని సూచించారు. విద్యార్థులకు సౌకర్యంగా ఉండేలా సిద్ధం చేయాలన్నారు.