'ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొనాలి'
MDK: తూప్రాన్‌లో టీజీ యూఈఈయు (సీఐటీయు) జిల్లా అధ్యక్షులు మన్నె నర్సింహులు విలేకరులతో మాట్లాడారు. విద్యుత్ సంస్థలో 20, 25 ఏళ్లుగా సేవలందిస్తున్న ఆర్టిజన్లు, ఇతర కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీవీఏఈ జెఎసీ ఇచ్చిన పిలుపుకు తాము పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. వరంగల్ NPDCL కార్యాలయం ముందు జరిగే ధర్నాలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు.