నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
వనపర్తి జిల్లాలోని 11 కేవీ ఉప కేంద్రాలో ఏబీ స్విచ్లు, బస్ బార్ ఏర్పాటు కొరకు ఇవాళ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని జిల్లా ఏఈ సుధాకర్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు బాల నగర్, నర్సింగాయపల్లి, మెటర్నిటీ చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఈ అంతరాయాన్ని గమనించి వినియోగదారులు సహకరించాలని కోరారు.