VIDEO: ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన లారీ

VIDEO: ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన లారీ

SRPT: తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామం వద్ద శనివారం ఆర్టీసీ బస్సును ఓ లారీ ఢీ కొట్టింది. ఎదురుగా వచ్చి ఢీకొనడంతో బస్సులో ప్రయాణిస్తున్న ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఇద్దరు డ్రైవర్లకి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు  అయింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.