చండీ హోమంలో పాల్గొన్న చిలకం మధుసూదన్
సత్యసాయి: ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ పెద్దమ్మ దేవి దేవస్థానంలో వడుగూరు కుటుంబం నిర్వహించిన చండీ హోమం కార్యక్రమంలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, ఆయన భార్య చిలకం ఛాయాదేవి పాల్గొన్నారు. అనంతరం పెద్దమ్మ అమ్మవారి, మహంకాళి అమ్మవారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొన్నారు.