'జనసేన తెలంగాణలో మరింత బలోపేతం అవుతుంది'
HYD: రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తెలంగాణలో మరింత బలోపేతం అవుతుందని జనసేన పార్టీ జాతీయ కార్యదర్శి రామ్ తాలూరి అన్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద జరిగిన కార్యక్రమానికి హాజరై పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం యువతకు కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు.