60 టీఎంసీలకు చేరిన SRSP నీటిమట్టం

NZB: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ ఫ్లో కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు నీటిమట్టం 60TMC లకు చేరుకుంది. జలాశయంలోకి ప్రస్తుతం 8,503 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది.కాగా ప్రాజెక్ట్ నుంచి వివిధ కాల్వల ద్వారా 4,425 క్యూసెక్కుల అవుట్ ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు(80TMC లు)కాగా ప్రస్తుతం 1085.10 ఉంది.