బియ్యం నాణ్యతను పరిశీలించిన కలెక్టర్

NLG: హాలియ మండలంలోని వజ్ర తేజ రైస్ క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్‌ను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదివారం సందర్శించారు. ఇక్కడ ఉత్పత్తి అవుతున్న బియ్యం నాణ్యతను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అదనపు కలెక్టర్ జే.శ్రీనివాస్, ఫిలిప్పీన్స్ దేశ ప్రభుత్వ అధికారులు, జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ హరీష్, వజ్రతేజ రైస్ మేనేజింగ్ డైరెక్టర్ చిట్టిపోలు యాదగిరి పాల్గొన్నారు.