కరాచీ తీరానికి తుర్కియే యుద్ధనౌక

కరాచీ తీరానికి తుర్కియే యుద్ధనౌక

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఉద్రిక్తతలు ఒక్కసారిగి పెరిగిపోయాయి. ఈ క్రమంలో పాక్ తన మిత్ర దేశాలతో సంప్రదింపులు చేస్తున్నట్లు భారత్‌కు సమాచారం ఉంది. దానికి మరింత బలం చేకూర్చేలా తాజాగా తుర్కియేకు చెందిన టీజీసీ బుయుకడా అనే భారీ యుద్ధ నౌక కరాచీ తీరాన్ని చేరింది. 2013లో జలప్రవేశం చేసిన ఈ యుద్ధ నౌక జలాంతర్గాములకు వ్యతిరేకంగా పని చేయగలదు.