470 లీటర్ల సారా స్వాధీనం
PPM: ఆంధ్ర, ఒడిశా సరిహద్దు గ్రామాలైన కేరడ, అనిజ, బోర్వలువలో శుక్రవారం జిల్లా ఎక్సైజ్ శాఖ ఏఈఎస్ సంతోష్ ఆధ్వర్యంలో ఒడిశా ఎక్సైజ్ విభాగం సహకారంతో సంయుక్త దాడులు నిర్వహించినట్లు కురుపాం ఎక్సైజ్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. అనంతరం సీఐ మాట్లాడుతూ.. 7000 లీటర్ల సారా తయారీ సరుకులు, 470 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.