ప్రజా వినతులను సత్వరమే పరిష్కరించాలి: అదనపు కలెక్టర్
KMM: ప్రజా వినతులను సత్వరమే పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇవాళ నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రజల అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ బాధితులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.