VIDEO: బాణాసంచా దుకాణాల్లో కమిషనర్ తనిఖీలు
KDP: దీపావళి పండుగ సందర్భంగా, బద్వేల్ మున్సిపాలిటీలో సిద్ధవటం రోడ్డు, పోరుమామిళ్ల బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన బాణాసంచా దుకాణాలను సోమవారం మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి పరిశీలించారు. బాణాసంచా విక్రయాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకుంటున్న జాగ్రత్తలపై ఆయన ఆరా తీశారు.