నగర శివారులో నీటి కష్టాలు

HYD: శివారులోని మేడ్చల్ మూడుచింతలపల్లి మం. లక్ష్మాపూర్ తండాలో తాగునీరు రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 5 నెలలుగా మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో బోర్లు, బావులే వాళ్లకు దిక్కయ్యాయి. పంచాయతీ అధికారులు, సంబంధిత శాఖకు తెలియజేసినా పట్టించుకునే నాథుడే కరవయ్యారని తండావాసులు వాపోతున్నారు. అధికారులకు తమ అవస్థలు కనిపించట్లేదా అని ప్రశ్నిస్తున్నారు..?