VIDEO: బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బీసీ సబ్ ప్లాన్ సాధన కమిటీ

VIDEO: బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బీసీ సబ్ ప్లాన్ సాధన కమిటీ

NGKL: నాగర్ కర్నూల్ మండలం కుమ్మెర గ్రామంలో ఇటీవల చోటుచేసుకున్న కుల వివక్ష ఘటనపై బీసీ సబ్ ప్లాన్ సాధన కమిటీ కార్యదర్శి గోపాల్ తీవ్రంగా స్పందించారు. ఘటనా స్థలాన్ని సందర్శించి, బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. జరిగిన ఉదంతం గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. సమాజంలో వెనుకబడిన వర్గాలపై జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.