వైభవంగా ముగిసిన గుత్తి కోట ఉత్సవాలు
ATP: గుత్తిలో రెండు రోజుల పాటు నిర్వహించిన కోట ఉత్సవాలు ఆదివారం రాత్రి ఘనంగా ముగిశాయి. ముగింపు వేడుకల్లో ఎమ్మెల్యేలు జయరాం, దగ్గుపాటి, కలెక్టర్ ఆనంద్ పాల్గొని ప్రసంగించారు. చారిత్రక సంస్కృతిని చాటిచెప్పేలా సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. CM చంద్రబాబు రూ.50 లక్షల నిధులు మంజూరు చేయడంతో ఉత్సవాలను వైభవంగా నిర్వహించినట్లు ఎమ్మెల్యేలు తెలిపారు.