'ప్రజావాణి కార్యక్రమానికి సకాలంలో హాజరు కావాలి'

'ప్రజావాణి కార్యక్రమానికి సకాలంలో హాజరు కావాలి'

BDK: రేపు కలెక్టరేట్‌లో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని కలెక్టర్ అంకిత్ తెలిపారు. ప్రజలు తమ తమ సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వక ఫిర్యాదులను సమర్పించాలని సూచించారు. ఉదయం 10.30 గంటలకు ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమవుతుందని దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.