ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని వినతి
ADB: పట్టణంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ZPGPF సూపరిండెంట్ సుధాకర్‌ను PRTU TS జిల్లాధ్యక్షుడు కృష్ణకుమార్, ప్రధాన కార్యదర్శి నరసింహ స్వామి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. విశ్రాంత ఉపాధ్యాయుల జీపీఎఫ్ లోన్, అకౌంట్ స్లిప్స్ ఆన్‌లైన్‌లో పొందుపర్చాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. పదవి విరమణ పొందిన ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.