VIDEO: ఎమ్మెల్యేపై ఆంక్షలు విధించాలి: హర్ష వీణ

VIDEO:  ఎమ్మెల్యేపై ఆంక్షలు విధించాలి: హర్ష వీణ

అన్నమయ్య: రైల్వేకోడూరు MLA అరవ శ్రీధర్ పార్టీ కార్యక్రమాలలో పాల్గొనకుండా నిరోధించాలని గురువారం హర్ష వీణ ప్రజా దర్బార్‌లో వినతిపత్రం సమర్పించారు. జనసేన త్రిసభ్య కమిటీ నివేదిక వచ్చేంతవరకు కార్యక్రమాలకు దూరంగా ఉంటానని చెప్పిన శ్రీధర్ ప్రస్తుతం పార్టీలో చురుకుగా పాల్గొంటున్నారని ఆమె విమర్శించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలను ఆయన ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు.