జిల్లాకు రాష్ట్రంలో ప్రథమ స్థానం

జిల్లాకు రాష్ట్రంలో ప్రథమ స్థానం

E.G: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పనితీరు గణాంకాలలో రాష్ట్ర స్థాయిలో తూ.గో. జిల్లా ప్రథమ స్థానం సాధించడం గర్వకారణమని కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం పేర్కొన్నారు. 75.54 శాతం మార్కులతో జిల్లా ఈ ఘనత సాధించిందన్నారు. సేవల నాణ్యత, క్షేత్ర స్థాయి అమలు, ఆరోగ్య ప్రచార కార్యక్రమాలలో చూపిన క్రమశిక్షణ రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచాయని కలెక్టర్ పేర్కొన్నారు.