చీకట్లో బ్యాంక్ ఆఫ్ బరోడా.. ఖాతాదారుల అవస్థలు

చీకట్లో బ్యాంక్ ఆఫ్ బరోడా.. ఖాతాదారుల అవస్థలు

SRPT: సూర్యాపేట పట్టణంలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో బుధవారం విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సేవలు స్తంభించాయి. ఉదయం నుంచి పవర్ లేకపోవడం, ఇన్వర్టర్ సౌకర్యం లేకపోవడంతో బ్యాంకు చిమ్మచీకటిగా మారింది. పై అంతస్తులో పనుల వల్ల వైర్లు తెగిపోగా, మేనేజర్ అందుబాటులో లేకపోవడంతో సమాధానం చెప్పే వారు కరువయ్యారు. దీంతో వివిధ పనుల కోసం వచ్చిన ఖాతాదారులు ఇబ్బంది ఎదుర్కొన్నారు.