అక్రమంగా తరలుతున్న ఇసుక లారీలు పట్టివేత
SRD: అక్రమంగా కర్ణాటక ఇసుక తరలిస్తున్న మూడు లారీలను న్యాల్కల్ పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం కరీంనగర్ నుంచి మండలంలోని శంశోల్లాపూర్ గ్రామ శివారులో జహీరాబాద్ -బీదర్ రోడ్డు మార్గంలో ఎస్సై దోమ సుజిత్ తమ సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న మూడు లారీలను హద్నూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వాల్టా చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు.