మంచిమాట: 100 శాతం కష్టపడితేనే అద్భుతాలు
మీరు 80 శాతం కష్టపడితే, 80 శాతం ఫలితాలు వస్తాయన్న గ్యారంటీ లేదు. కానీ, 100 శాతం కష్టపడితే 1,000 శాతం ఫలితాలు వచ్చే అవకాశముంది. చివరి 20 శాతం ప్రయత్నాల్లోనే అద్భుతాలు జరుగుతుంటాయి. కానీ, ఆ క్లిష్టమైన తుది దశలోనే చాలామంది చేతులెత్తేస్తుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడని మనస్తత్వంతో, లక్ష్యసాధన కోసం దాదాపు పిచ్చిపట్టినట్లు పనిచేసేవారే అనూహ్య ఫలితాలను సొంతం చేసుకుంటారు.