కౌంటింగ్ కేంద్రంలో కలెక్టర్, ఎస్పీ

కౌంటింగ్ కేంద్రంలో కలెక్టర్, ఎస్పీ

GDWL: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శాంతియుత వాతావరణంలో సజావుగా జరుగుతోందని కలెక్టర్ సంతోష్ తెలిపారు. ఆదివారం రాజోలి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కౌంటింగ్‌లో పారదర్శకత, ఖచ్చితత్వం అత్యంత ముఖ్యమని అన్నారు.