'నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి'
పెద్దపల్లి డీసీపీ భూక్య రామిరెడ్డి శుక్రవారం ధర్మారం మండలం మేడారం, దొంగతుర్తి, ఖిలా వనపర్తి గ్రామాలలో పర్యటించారు. ఈనెల 14న జరిగే ఎన్నికలలో ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. అభ్యర్థులు ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురి చేయవద్దని హెచ్చరించారు. ఆయన వెంట ఏసీపీ కృష్ణ, సీఐ కే. ప్రవీణ్ కుమార్, ఎస్సై ఎం. ప్రవీణ్ కుమార్ ఉన్నారు.