VIDEO: 'వికలాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి'

KMM: వికలాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని MRPS జిల్లా అధ్యక్షుడు కూరపాటి సునీల్ మాదిగ డిమాండ్ చేశారు. మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు సోమవారం ఖమ్మం కలెక్టరేట్ ఎదుట వృద్ధులు వితంతువులు, వికలాంగులతో కలిసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సునీల్ మాదిగ మాట్లాడుతూ.. వికలాంగులకు రూ.6వేలు, వృద్ధులు, వితంతువులకు రూ.4వేలు పెంచి ఇవ్వాలన్నారు.