రాజంపేట తాహసీల్దార్ కార్యాలయంలో ఏసీల చోరీ కలకలం
KDP: రాజంపేట పట్టణంలోని తాహసీల్దార్ కార్యాలయంలో రెండు ఏసీలు గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. శనివారం ఉదయం కార్యాలయం తెరిచి చూసిన సిబ్బంది ఏసీలు కనిపించకపోవడంతో అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.