సచివాలయ సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం

సచివాలయ సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం

VSP: సాగర్ నగర్-1 సచివాలయాన్ని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ మంగళవారం తనిఖీ చేశారు. సిటిజన్ సర్వే, ఈ-కేవైసీ చేయటంలో సిబ్బంది బాగా వెనుకబడి ఉన్నారని, ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని నిలదీశారు. ఇంకా 400 మంది తాలూక ఈ-కేవైసీ పెండింగ్ ఉండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో పురోగతి కనిపించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.