కొటగుళ్లలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ప్రత్యేక పూజలు
BHPL: కోటగుళ్లలో దేవాదాయ శాఖ, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ నందనం కవిత కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు నాగరాజు ఆమెతో పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో కవితను ఘనంగా సత్కరించారు.