ప్రతి నాయకుడిని కలుపుకొని వెళుతున్నాం: కేశినేని

ప్రతి నాయకుడిని కలుపుకొని వెళుతున్నాం: కేశినేని

కృష్ణా: విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గతంలో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన యలమంచలి రవిని నేడు టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం చిన్ని మాట్లాడుతూ.. కలిసి వచ్చే ప్రతి ఒక్క నాయకుడిని కలుపుకొని ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ప్రస్తుతం విజయవాడలో కేశినేని చిన్ని, రవి భేటి రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.