రహదారి కష్టాలు తీర్చండి.. మహాప్రభో.!

ASR: అనంతగిరి మండలం వేంగాడ పంచాయితీ పరిధి బంధవలసకి రహదారి నిర్మాణం చేపట్టాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. సంవత్సరం క్రితం గిరిజనులు సొంతంగా చేసుకున్న మట్టిరోడ్డు ఏటా వర్షాకాలంలో బురదమయమై అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు కనీసం అంబులెన్స్ కూడా రాలేని పరిస్థితి నెలకొందని బుధవారం వాపోయారు. అధికారులు స్పందించి రహదారి నిర్మించాలని కోరారు.