ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే

ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే

పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు ఇవాళ సుల్తానాబాద్ మండలం నారాయణరావు పల్లిలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్నారు. గ్రామానికి చెందిన పొన్నం స్వప్న, అంజయ్య దంపతులు ప్రభుత్వ సహకారంతో నిర్మించుకున్న ఇందిరమ్మ ఇల్లును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్, సర్పంచ్ పాల్గొన్నారు.