రైల్వే బ్రిడ్జి కూలి 12 మంది మృతి

నిర్మాణంలో ఉన్న భారీ రైల్వే వంతెన కుప్పకూలిన ఘటన చైనాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోగా మరో నలుగురు నదిలో గల్లంతయ్యారు. సిచువాన్ - కింగ్ హై రైల్వే ప్రాజెక్టులో భాగంగా యెల్లో రివర్ పై బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. స్టీల్ కేబుల్ తెగిపోవడంతో బ్రిడ్జి కుప్పకూలినట్లు అధికారులు వెల్లడించారు.