పాకాల అధ్యాపకుడుకి భాగవతరత్న పురస్కారం

TPT: పాకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకుడు డాక్టర్ కలవకుంట ఈశ్వరబాబు భాగవతరత్న పురస్కారం అందుకున్నారు. హైదరాబాద్ కొండాపూర్‌లోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో జన్మాష్టమి సందర్భంగా తెలుగు భాగవత ప్రచార సమితి ఆయనకు మెడల్, ప్రశంసాపత్రం, పది వేల రూపాయల నగదు ప్రదానం చేశారు. ఆంధ్ర మహాభాగవతం చిన్న పాత్రలు"పై చేసిన పరిశోధనకు గాను ఆయనకు ఈ గౌరవం దక్కిందన్నారు.