'ఎన్నికల విధులు ఆన్ డ్యూటీగా పరిగణించాలి'
MNCL: గ్రామపంచాయతీ ఎన్నికల విధులకు హాజరయ్యే సింగరేణి ఉద్యోగులకు ఆన్ డ్యూటీగా పరిగణించాలని హెచ్ఎంఎస్ అధ్యక్షుడు తిప్పారపు సారయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. సింగరేణి సెక్యూరిటీ సిబ్బందిని ఎన్నికల విధులకు పంపుతున్న యాజమాన్యం స్పెషల్ లీవ్‌పై విధులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడం వల్ల ఆర్థిక నష్టానికి గురవుతున్నారని తెలిపారు.