నీట మునిగిన ఆసుపత్రి పరిసరాలు

MDK: మనోహరాబాద్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిసరాలు నీట మునిగిపోయాయి. ఆదివారం రాత్రి 13 సెంటీమీటర్ల వర్షం పడడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఆస్పత్రికి వెళ్లేందుకు సిబ్బంది తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చిన గర్భిణి వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో వెనుతిరిగి వెళ్ళిపోయారు.