'కళాశాలలో సామూహిక వందేమాతరం గీతాలాపన'
GDWL: గద్వాల పట్టణంలోని ఓ జూనియర్ కళాశాలలో శుక్రవారం సామూహిక వందేమాతరం గీతాలాపన కార్యక్రమాన్ని బీజెపీ కార్యకర్తలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు మాట్లాడుతూ.. మన స్వాతంత్య్ర సమరయోధులకు స్ఫూర్తినిచ్చి, హృదయాల్లో దేశభక్తిని వెలిగించిన వందేమాతరం గేయానికి నేటితో 150 సంవత్సరాలు పూర్తయిందని పేర్కొన్నారు.