VIDEO: సత్యనారాయణ ఆలయంలో ప్రత్యేక పూజలు
SKLM: ఎచ్చెర్ల మండలం అల్లినగరం గ్రామంలో వెలసిన శ్రీ రామ సత్యనారాయణ స్వామి ఆలయంలో కార్తీక శనివారం ప్రత్యేక పూజలను చేపట్టినట్లు ఆలయ అర్చకులు విజయ్ భాస్కర్ శర్మ తెలిపారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి, అభిషేకాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. పరిసర ప్రాంతాలలోని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.