VIDEO: ప్రైవేట్ పాఠశాల బస్సులను తనిఖీ చేసిన సీఐ
ASF: ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులను రోడ్లపై నడపరాదని సీఐ బాలాజీ వరప్రసాద్ హెచ్చరించారు. సోమవారం ఆసిఫాబాద్ పట్టణ ప్రైవేట్ పాఠశాల బస్సులను సీఐ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బస్సులకు సంబంధించిన బీమా పత్రాలు, ఫిట్నెస్ సర్టిఫికేట్లు సరిగా ఉన్నాయా లేవా అని పరిశీలించారు. నిబంధనలు పాటించాలని స్కూల్ యజమానులకు సూచించారు.