ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి

చిత్తూరు: శ్రీకాళహస్తి పట్టణంలోని 5వ వార్డు బహదూర్ పేటలో ఆదివారం ఎన్నికల ప్రచారం జరిగింది. ఎమ్మెల్యే సతీమణి శ్రీవాణి రెడ్డి పాల్గొన్నారు. స్థానిక వైసీపీ నాయకులతో కలసి ఆమె ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసి తన భర్తను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.