తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి సురేఖ

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి సురేఖ

WGL: తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ తిరుమల- తిరుపతి దేవస్థానాన్ని మంగళవారం సందర్శించారు. నేడు మంత్రి పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, తెలంగాణ ప్రభుత్వం చేసే అన్ని పనుల్లో స్వామివారి దీవెనలు, ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు మంత్రి తెలిపారు.