అధ్వానంగా తయారైన మట్టిరోడ్డు
ప్రకాశం: దొనకొండ మండలం వెంకటాపురం గ్రామంలోని ప్రధాన మట్టి రోడ్డు అధ్వానంగా మారింది. చినుకులు పడితే రోడ్డు బురదమయమై నడవలేకుండా మారుతోంది. జారి కిందపడతామని స్థానికులు భయపడుతున్నారు. వాహనదారులు, పాదచారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. అధికారులు తక్షణమే సిమెంట్ రోడ్డు నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు.