'సంక్రాంతి పండుగ రైతుల కష్టానికి ప్రతీక’
JGL: భోగి పండగ సందర్భంగా రామడుగు మండలం షానగర్ గ్రామంలోని భూలక్ష్మి చౌరస్తా వద్ద గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో సర్పంచ్ గునుకొండ శైలజ పాల్గొని మాట్లాడారు. పూర్వకాలం నుంచి వస్తున్న సాంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. సంక్రాంతి పండుగ రైతుల కష్టానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు.