VIDEO: రేపల్లె-పెనుమూడి హైవేపై ప్రమాదం

VIDEO: రేపల్లె-పెనుమూడి హైవేపై ప్రమాదం

BPT: రేపల్లె నుంచి పెనుమూడి వెళ్లే జాతీయ రహదారిపై ఆదివారం ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎదురుగా వస్తున్న కేటీఎం బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరికి గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.