నేడు యూత్ కాంగ్రెస్ పార్లమెంట్ ముట్టడి
భారత్-US మధ్య కుదిరిన ట్రేడ్ డీల్ స్వదేశీ ప్రయోజనాలకు విఘాతమని ఆరోపిస్తూ యూత్ కాంగ్రెస్ నిరసన చేపట్టనుంది. ఈ ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ 'పార్లమెంట్ ముట్టడి'కి పిలుపునిచ్చింది. కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా ఢిల్లీకి చేరుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పార్లమెంట్ పరిసరాల్లో పటిష్ట భద్రతను ఏర్పాటు చేయడంతో పాటు పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.