విదేశీయుల సమాచారం తెలపండి: ఏసీపీ

విదేశీయుల సమాచారం తెలపండి: ఏసీపీ

NTR: విజయవాడలో విదేశీయులకు ఆశ్రయం కల్పించేవారు వారి వివరాలను విధిగా ఆన్‌లైన్‌లో ఫాం-సీ ద్వారా బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ పోర్టల్‌లో నమోదు చేయాలని ఏసీపీ దామోదర్ తెలిపారు. హోటళ్లు, లాడ్జీల్లో ఉండే విదేశీయుల వివరాలను వెంటనే స్థానిక పోలీసు స్టేషన్‌లో అందించాలని సూచించారు. నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.