ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ భద్రత
కడప: జిల్లా ఒంటిమిట్ట కోదండరామాలయం బ్రహ్మోత్సవాల నేపథ్యంలో జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ భద్రతా ఏర్పాట్లపై పోలీస్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. హెలిప్యాడ్, పార్కింగ్, కల్యాణవేదిక పరిసరాలను పరిశీలించి భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీఐపీల రాక దృష్ట్యా తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.