అంబటి కుటుంబాన్ని పరామర్శించిన బూచేపల్లి
ప్రకాశం: గుంటూరులో కూటమి ప్రభుత్వం నమోదు చేసిన కేసుల నేపథ్యంలో రాజమండ్రి జైలుకు తరలించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను ప్రకాశం జిల్లా YCP అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి దర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ న్యాయపరంగా పోరాడతామని అన్నారు. పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. రాజకీయ వేధింపులు తగవని వ్యాఖ్యానించారు.