పంజా విసురుతున్న వైరల్ వ్యాధులు

NLG: జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు, వాతావరణంలో వచ్చిన మార్పులతో పట్టణాలతో పాటు గ్రామాల్లో వైరల్ వ్యాధులు పంజా విసురుతున్నాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు రోగుల తాకిడి పెరిగింది. రోగులతో NLG ప్రభుత్వ ఆసుపత్రి నిత్యం కిటకిటలాడుతోంది. ఇక్కడ నిత్యం 500లకుపైగా ఓపీలు నమోదు అవుతున్నాయి.