దుగ్నేపల్లి సర్పంచ్‌గా జుమ్మిడి లలిత
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం దుగ్నేపల్లి రెండో గ్రామపంచాయతీ స్థానిక ఎన్నికల ఫలితాలలో సర్పంచ్‌గా BRS బలపరిచిన అభ్యర్థి జుమ్మిడి లలిత ఘనవిజయం సాధించారు. సమీప ప్రత్యర్థిపై 320 ఓట్లు సాధించి ఆమె గెలుపొందారు. దీంతో మద్దతుదారులు గ్రామంలో సంబరాలు నిర్వహించారు. తనకు ఓటు వేసి గెలిపించిన గ్రామస్థులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.