తెర్నేకల్‌లో పీహెచ్‌సీ నిర్మాణం ప్రారంభం

KRNL: దేవనకొండ మండలం తెర్నేకల్ గ్రామంలో శనివారం రూ.2 కోట్లతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి శనివారం భూమిపూజ నిర్వహించారు. జనసేన ఇంఛార్జ్ వెంకప్ప ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏడేళ్ల స్థల వివాదం పరిష్కారంతో గ్రామంలో హర్షాతిరేకం నెలకొందన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, R&B అధికారులు పాల్గొన్నారు.